క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన జువ్వాడి కృష్ణారావు
NEWS Jan 16,2025 04:24 am
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని నిర్వహించిన గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వాహకులను అభినందిస్తున్నానని యువకులు క్రీడల్లో రాణించాలని కోరారు.