Logo
Download our app
పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం
NEWS   Jan 15,2025 03:51 pm
కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పందించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా పసుపుకు మద్దతు ధర కల్పించడమే కాకుండా మార్కెటింగ్‌ వ్యవస్థ, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పసుపు బోర్డుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తూబోర్డుకు ప్రత్యేక నిధి కేటాయించాలన్నారు. కేంద్ర చొరవతో నిజాం చక్కెర ఫ్యాక్టరీలను ప్రారంభం చేయాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source