జిల్లా వాసికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
NEWS Jan 15,2025 09:43 am
నిజామాబాద్‌కు చెందిన రమేశ్ కార్తీక్ నాయక్ తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు భాష నుంచి రమేశ్ కార్తీక్ నాయక్ తన తొలి కథల సంపుటి ఢావ్లో- గోర్ బంజారా కతలు పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. ఒడిషా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఉత్కల్ విశ్వవిద్యాలయంలో 2024 సంవత్సరానికిగాను సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ పురస్కారాన్ని అందజేశారు. జిల్లావాసికి పురస్కారం దక్కడంపై హరిదా రచయితల సంఘం హర్షం వ్యక్తం చేశారు.