భీంగల్ సిఐ నవీన్ పై బదిలీ వేటు
NEWS Jan 15,2025 09:45 am
భీంగల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నవీన్ పై అధికారులు బదిలీ వేటు వేశారు. నిజామాబాద్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెళ్లడయ్యాయి. ఇటీవల భీంగల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పలు కేసుల్లో పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. భీంగల్ కు చెందిన సత్య గంగయ్య తన కేసు విషయంలో తన లొకేషన్ ను సీఐ ట్రేస్ చేసి ఇవ్వడంతోనే తనపై దాడి చేయడం జరిగిందని ఆరోపణలు చేశారు.తనపై దాడికి పూర్తి బాధ్యత సీఐ దేనని ఆర్మూర్ ఏసీపీ విచారణలో బాధితుడు చెప్పినట్టు సమాచారం.