సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్
NEWS Jan 15,2025 08:09 am
మంత్రి కొండా సురేఖ మెదక్ జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ వర్తింప చేయాలని కోరారు. కోతలు లేకుండా రూ. 12 వేలు ఇవ్వాలని సూచించారు. మంత్రి జోక్యం చేసుకుంటూ తమ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి చేయూతను ఇస్తుందన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.