Logo
Download our app
సుప్రభాత సేవ పునః ప్రారంభం
NEWS   Jan 15,2025 06:52 am
పవిత్రమైన ధనుర్మాసం ముగియడంతో ఇవాల్టి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభ‌మైంది. గత ఏడాది డిసెంబరు 16వ తేదీ నుండి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ నుండి యథా ప్రకారం సుప్రభాత సేవ పునః ప్రారంభమైంది.
⚠️ You are not allowed to copy content or view source