ఐదేళ్ల తర్వాత నిజమైన పండుగ
NEWS Jan 15,2025 04:59 am
నిజమైన సంక్రాంతి ఐదేళ్ల తర్వాత వచ్చిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్వంత గ్రామానికి రావడం ఆనందంగా ఉందన్నారు. తన భార్య గత 25 ఏళ్లుగా ఇక్కడికి రావడం మొదలు పెట్టిందన్నారు. కుప్పం నియోజకవర్గం తనను ఎంతగానో ఆదరించిందని అన్నారు. ఇక్కడి ప్రజలందరికీ ఎల్లవేళలా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు వారు విస్తరించి ఉన్నారని అన్నారు.