లండన్ పర్యటనకు వైఎస్ జగన్
NEWS Jan 15,2025 04:55 am
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి పట్టా ప్రదానోత్సవానికి జగన్ దంపతులు హాజరు కానున్నారు. తన కూతురు ప్రపంచ ప్రఖ్యాత కింగ్స్ కాలేజీ లండన్‌లో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సును పూర్తి చేశారు. చక్కటి ప్రతిభ కనబరిచి డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈనెల 16న లండన్‌లో ప్రదానోత్సవం జరగనుంది. ఈ నెలాఖరున జగన్ లండన్ నుంచి తిరిగి ప్రయాణం అవుతారు.