కోరుట్ల: నిలిచిపోయిన అద్దె బస్సులు
NEWS Jan 14,2025 03:27 pm
కోరుట్ల ఆర్టీసీ డిపో పరిధిలో అద్దె బస్సులు నిలిచిపోయాయి. డ్రైవర్లు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులకు హాజరు కాలేదు. దీంతో కోరుట్ల ఆర్టీసీ డిపో పరిధిలోని 25 బస్సులు బస్టాండ్ వద్దనే ఉన్నాయి. దీంతో కోరుట్ల డిపో పరిధిలోని ఆయా రూట్లలో బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు.