ప్రజలకు అండగా పల్లె పండుగ
NEWS Jan 14,2025 11:21 am
ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండేందుకే పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్. ధర్మవరం నియోజకవర్గంలోని యర్రాయపల్లెలో పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా తొలిసారిగా ఈ ఊరికి వచ్చానని, మీరు ఆదరించిన తీరుకు ఎల్లప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. మీ ఆశీర్వాదం వల్లనే తాను గెలుపొందానని చెప్పారు. తమ ప్రభుత్వం గ్రామాల అభివృద్దిపై ఫోకస్ పెట్టిందన్నారు.