నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
NEWS Jan 14,2025 06:38 am
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలు దేరి వెళ్లారు. ఈ సందర్బంగా ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈనెల 16 నుంచి 19 వరకు సింగపూర్ లో పర్యటిస్తారు. అనంతరం 20 నుంచి 22 వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు సీఎం. ఆయనతో పాటు ఉన్నతాధికారులు కూడా హాజరవుతారు. మరో వైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా దావోస్ కు బయలుదేరారు.