నేడే మకరజ్యోతి దర్శనం
NEWS Jan 14,2025 04:30 am
శబరిమలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. 14న మకర జ్యోతి దర్శన భాగ్యం కలగనుంది. పొన్నం బలమేడుపై జ్యోతి రూపంలో దర్శనమిచ్చే అయ్యప్ప స్వామి దర్శనానికి శబరి కొండకు తండోప తండాలుగా చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న భద్రతకు తోడు అదనంగా 5 వేల మంది పోలీసులు మోహరించారు.