కుంభమేళా భక్తులతో కిటకిట
NEWS Jan 14,2025 04:07 am
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా ప్రారంభమైంది. తొలి రోజు ఏకంగా కోటిన్నర మంది భక్తులు పుణ్య స్నానం చేశారని ప్రభుత్వం ప్రకటించింది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇవాళ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరో వైపు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల నమూనా ఆలయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. కేంద్ర సర్కార్ 3 వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు కల్పించింది .