Logo
Download our app
పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి: జువ్వాడి కృష్ణరావు
NEWS   Jan 13,2025 03:49 pm
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇతర అధికారులపై దౌర్జన్యం చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. కోరుట్లలోని జువ్వాడి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశంపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source