Logo
Download our app
విద్యుత్ తీగలు తగిలి బాలుడికి తీవ్ర గాయాలు
NEWS   Jan 13,2025 03:43 pm
ఓ బాలుడికి విద్యుత్ తీగలు తగిలి గాయాలపాలైన సంఘటన కోరుట్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని జవహర్ రోడ్డులో అద్దె ఇంట్లో ఉంటున్న ఆర్యన్ అనే బాలుడు డాబా పైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తీగ తగిలింది. దీంతో బాలుడు తీవ్రగాయాలై పడిపోవడంతో స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source