Logo
Download our app
కొండగట్టులో ఘనంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం
NEWS   Jan 13,2025 10:20 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం గోదాదేవి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా పచ్చని తోరణాల మధ్య వేద పండితుల మంత్రోచ్చరణాలతో కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source