డైరెక్టర్ పై మహిళా కమిషన్ సీరియస్
NEWS Jan 13,2025 09:16 am
నటి అన్షుపై మహిళా లోకం సిగ్గుపడేలా కామెంట్స్ చేసిన డైరెక్టర్ త్రినాథరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్నామని అన్నారు. త్వరలో నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అన్షు సైజులు తగ్గాయని భారీగా పెంచాలని బహిరంగ వేదికగా కామెంట్ చేశారు. తెలుగు ప్రేక్షకులు సైజులను ఎక్కువగా ఇష్ట పడతారంటూ నోరు పారేసుకున్నారు.