హెల్మెట్లు ధరించండి ప్రాణాలు కాపాడుకోండి
NEWS Jan 13,2025 08:53 am
పార్టీలకు వేల రూపాయలు ఖర్చు చేసే బదులు ప్రాణాలు కాపాడే హెల్మెట్లను ధరించక పోవడం దారుణమన్నారు మంత్రి దాసరి సీతక్క. ఆసిఫాబాద్ లో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను ప్రారంభించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాల నుండి బయట పడే అవకాశం ఉందన్నారు. మనం చేసే తప్పుల వల్ల ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడకూడదన్నారు. రోడ్డు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.