హైదరాబాద్ లో కైట్ అంట్ స్వీట్ ఫెస్టివల్
NEWS Jan 13,2025 08:48 am
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా హైదరాబాద్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో 19 దేశాలకు చెందిన 47 మంది అంతర్జాతీయ క్లైట్ ఫ్లైయర్స్ పాల్గొనడం విశేషం. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ పోటీలు ఈనెల 13 నుండి మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ఇందు కోసం ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.