Logo
Download our app
బోధన్ టాస్క్ ఫోర్స్ దాడులు
NEWS   Jan 13,2025 09:07 am
బోధన్‌ పట్టణంలోని పలు చోట్ల టాస్క్‌ఫోర్స్‌ టీం ఏసీపీ నాగేంద్రచారి నేతృత్వంలో సీఐ అంజయ్య, సిబ్బంది దాడులు నిర్వహించారు.ఆఫీసర్స్‌ క్లబ్‌పై దాడి చేసి పేకాడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 31వేల నగదు, 24 సెల్‌ఫోన్‌లు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బోధన్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.ఏఆర్‌ కిరాణా షాప్‌పై దాడి చేసి రూ. 8వేలు విలువ చేసే 8 చైనా మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. షాప్‌ యాజమాని జునైద్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని పీఎస్‌లో అప్పగించారు.
⚠️ You are not allowed to copy content or view source