నిజామాబాద్ సంక్రాంతి స్పెషల్ ఘేవర్ స్వీట్
NEWS Jan 13,2025 09:09 am
సంక్రాంతి వచ్చిందంటే చాలు..నిజామాబాద్‌లోని రాజస్థానీ స్వీట్ షాపులకు సందడి కనిపిస్తుంది. పండగకు వారం ముందు నుంచి గంజ్ మార్కెట్ కళకళలాడుతుంది. పండగపూట పిండివంటల తయారీకి అవసరమయ్యే సామాగ్రి కొనేందుకు ప్రజలు మార్కెట్‌కు వెళ్తారు. ప్రత్యేక స్వీట్‌ను ఆస్వాదించేందుకు వస్తుంటారు. కేవలం సంక్రాంతి పండుగ సమయంలోనే ఈ స్వీట్..షాపుల్లో దొరుకుతుంది. ఆ స్వీట్ పేరే ఘేవర్. స్వీట్ రుచి చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుంటారు.ఈ ఘేవర్‌రాజస్థానీ సాంప్రదాయ వంటకం.