Logo
Download our app
భీంగల్ సిఐ, ఎస్సైలపై ఆరోపణలు
NEWS   Jan 13,2025 11:33 am
భీమ్‌గల్‌ పట్టణ పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సీఐ నవీన్, ఎస్సై మహేష్ తమను వేధిస్తున్నారంటూ పలువురు వాపోతున్నారు. వరుస ఫిర్యాదులతో విషయం డీజీపీ కార్యాలయం, మానవ హక్కుల సంఘం దాకా చేరుకుంది. చెంగల్‌కు చెందిన నిఖిష్‌ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేశాడు. వాళ్ల వేధింపులు తాళలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల వ్యవహారం డీజీపీ ఆఫీస్‌తో పాటు హెచ్‌ఆర్‌సీకి వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు సైతం విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source