ప్యాన్ ఇండియా మూవీగా రానున్న
పెద్దింటి అశోక్ నవల జిగిరి
NEWS Jan 13,2025 04:42 am
ప్రముఖ నవలా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన జిగిరి నవల కరడి పేరుతో తమిళంలోకి అనువాదమైంది. శ్రీనివాస్ తెప్పల అనువాదం చేసిన ఈ నవల చెన్నైలో జరిగిన పుస్తక ప్రదర్శన లో మంచి గుర్తింపును పొందింది. ఆంగ్లంతో పాటు 12 భారతీయ భాషల్లోకి అనువాదం పొందిన ఈ నవల త్వరలో ప్యాన్ ఇండియా మూవీగా రాబో తుంది. తెలుగు నవల తమిళంలో పాటు మిగతా భాషల్లో గుర్తింపు పొందడం అరుదైన విషయం.