Logo
Download our app
ఆర్మూర్ లో చైన్‌ స్నాచర్ల అరెస్టు
NEWS   Jan 13,2025 11:33 am
ఆర్మూర్ పట్టణంలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ఒక మైనర్‌తో పాటు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.జెమ్మన్‌జట్టి గల్లీకి చెందిన బట్టు బాల్‌రాజ్‌ ఓ మైనర్‌ అబ్బాయితో కలిసి నంబర్‌లేని స్కూటీపై తిరుగుతూ చైన్‌స్నాచింగ్‌ పాల్పడినట్లు తెలిపారు. మామిడిపల్లిలోని రకుంబాయి మెడలో నుంచి, పెర్కిట్‌ విశాఖ కాలనీలో, రాజారాం నగర్‌లో మహిళల మెడలో నుంచి బంగారు గోలుసులను చోరీ చేశారన్నారు. నగలను పట్టణంలోని హరిచంద్రప్రసాద్‌కు విక్రయించారన్నారు.నిందితుడు బాల్రాజ్ ను అరెస్ట్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source