Logo
Download our app
ఏపీటీడీసీ చైర్మ‌న్ ఆక‌స్మిక త‌నిఖీ
NEWS   Jan 13,2025 03:56 am
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ నెల్లూరులోని ఏపీ హరిత హోటల్‌కు ఆకస్మిక తనిఖీ చేశారు. హోటల్ నిర్వహణ, పని తీరు తదితర వివిధ అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. హోటల్ కి సంబంధించిన పూర్తి రికార్డులను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న హోటల్ ఆధునికీకరణ పనుల పురోగతిని సమీక్షించి, సంబంధిత అధికారుల నుండి వివరణాత్మక నివేదికను ఇమ్మని ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source