Logo
Download our app
కొండగట్టులో యువకుడి ఆత్మహత్యాయత్నం
NEWS   Jan 12,2025 03:56 pm
మల్యాల కేంద్రానికి చెందిన మహిపాల్ అనే యువకుడు ఆదివారం కొండగట్టులోని బేతాళ స్వామి ఆలయ వెనుక భాగంలోని లోయలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే మహిపాల్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొండగట్టులో నిద్రిస్తే ఆరోగ్య సమస్య తీరుతుందనే నమ్మకంతో శనివారం సాయంత్రం ఆలయానికి తీసుకురాగా, ఈరోజు తెల్లవారుజామున మహిపాల్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source