Logo
Download our app
బడాపహాడ్‌ ఉర్సు ఘనంగా ప్రారంభం
NEWS   Jan 12,2025 06:43 am
వర్ని మండలం బడాపహాడ్‌ ఉర్సు ఘనంగా ప్రారంభమైంది. జలాల్పూర్‌లో దర్గా ప్రతినిధుల ఇంటి నుంచి ఉర్సు నైవేద్యాన్ని తీసుకువచ్చి గ్రామ చావిడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కవ్వాలి ఇతర సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ప్రార్థనలు నిర్వహించి షాదుల్లా బాబాకు సమర్పించే నైవేద్యాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి తలపై పెట్టుకుని ఉర్సు ప్రారంభించారు. ఉర్సు గంధాన్ని (నైవేద్యం) ఒంటె, గుర్రంపై ఉంచి జలాల్పూర్‌ నుంచి బడాపహాడ్‌ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం బడా పహాడ్‌ దర్గాపై ఉన్న శాదుల్లా బాబాకు సమర్పించారు.
⚠️ You are not allowed to copy content or view source