భూ భారతికి గవర్నర్ లైన్ క్లియర్
NEWS Jan 10,2025 04:11 am
తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ధరణి స్థానంలో కొత్తగా తీసుకు రానున్న భూ భారతికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ సందర్బంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తీసుకు వస్తామని చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందజేస్తామని స్పష్టం చేశారు. గత సర్కార్ ధరణి పేరుతో అడ్డగోలుగా భూములు కొల్లగొట్టిందని ఆరోపించారు.