ఏసీబీకి చిక్కన ప్రిన్సిపాల్
NEWS Jan 10,2025 03:24 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ భీమనపల్లి కృష్ణ అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అవుట్ సోర్సింగ్ ద్వారా అటెండర్ గా పని చేస్తున్న కొచ్చెర్ల రామకృష్ణ ద్వారా ఫిర్యాదుదారుడి నుండి డబ్బులు లంచంగా తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయాలని కోరింది అనిశా.