వైకుంఠానికి పంపిస్తున్న టీటీడీ
NEWS Jan 09,2025 11:34 am
దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష వినిపించడం బాధాకరమన్నారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయక పోవడం టీటీడీ పాలక మండలి వైఫల్యమేనంటూ ధ్వజమెత్తారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఇవ్వాలన్నారు.