బాధితులను ఓదార్చిన హోం మంత్రి
NEWS Jan 09,2025 08:41 am
తిరుపతి టోకెన్ల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను రుయా ఆస్పత్రిలో పరామర్శించారు హోం మంత్రి వంగలపూడి అనిత. తమ వారిని కోల్పోయిన బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఒకానొక సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. సున్నితమైన ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు.