Logo
Download our app
చైన్‌ స్నాచర్‌ అరెస్టు, బంగారం రికవరీ
NEWS   Jan 09,2025 09:56 am
నవీపేట మండలంలోని నందిగాం గ్రామంలో ఇటీవల జరిగిన చైన్‌ స్నాచింగ్‌ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి, బంగారు గొలుసును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.నందిగాం గ్రామంలోని ఇందూరు గంగామణి మెడలోనుంచి సుమారు రెండున్నర తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన దుండగుడు ఎత్తుకెళ్లిపోయాడు.పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితుడైన గంగాధర్‌ను టెక్నాలజీ ద్వారా, సీసీ ఫుటేజీ ద్వారా 24 గంటల్లోనే పోలీసులు గుర్తించి బంగారు గొలుసును,2 సెల్‌ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source