Logo
Download our app
నిధుల కోసం జీజీహెచ్ ఆసుపత్రి ఎదురుచూపులు
NEWS   Jan 09,2025 02:27 pm
నిజామాబాద్ జీజీహెచ్‌ ఆసుపత్రి మరమ్మతులకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రూ.6.62 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గత నెలలో జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జీజీహెచ్‌ భవనంలో లీకేజీలు, స్థానిక పరిస్థితిని చూసి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనానికి వెంటనే మరమ్మతులు చేయించాలని, అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మూడు నెలల్లో జీజీహెచ్‌ రూపురేఖలు మార్చాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source