కేటీఆర్ ను విచారిస్తున్న ఏసీబీ
NEWS Jan 09,2025 05:34 am
ఫార్ములా ఇ కార్ రేస్ కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు లాయర్ ను కూడా అనుమతించింది దర్యాప్తు సంస్థ. ముగ్గురు అధికారుల బృందం కేటీఆర్ ను విచారిస్తోంది. లైబ్రరీ రూంలో కూర్చొని విచారణ జరుగుతున్న తీరును పరిశీలించారు న్యాయవాది. ఎంక్వైరీని పర్యవేక్షిస్తున్నారు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి.