బాధితులను పరామర్శించిన మంత్రి
NEWS Jan 09,2025 05:24 am
టీటీడీ టోకెన్ల జారీ ఘటన తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తిరుపతికి వెళ్లారు. రుయా ఆస్పత్రిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ను ఆదేశించారు. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సర్కార్ తరపున ఆదుకుంటామన్నారు.