సాధారణ ప్రయాణికుడిలా రఘువీరా జర్నీ
NEWS Jan 09,2025 05:18 am
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఎన్ . రఘువీరా రెడ్డి వైరల్ గా మారారు. నాలుగుసార్లు రాష్ట్ర మంత్రిగా పని చేశారు. తన ఊరు నుంచి సాధారణ ప్రయాణికుడి లాగానే ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు ప్రయాణం చేశారు. సర్పంచ్ సైతం ఇవాళ బస్సు ఎక్కాలంటే నామూషీగా ఫీల్ అయ్యే ప్రస్తుత తరుణంలో రఘువీరా రెడ్డి లాంటి నాయకుడు ఎలాంటి భేషజాలకు పోకుండా జర్నీ చేయడం విశేషం. ఆయన సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.