మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇవ్వాలి
NEWS Jan 09,2025 05:03 am
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు జారీ చేసిన ఘటనలో ఆరుగురు భక్తులు దుర్మరణం చెందడం పట్ల సీపీఎం పార్టీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. కోటి రూపాయలు సాయం చేయాలని డిమాండ్ చేసింది. దీనికి బాధ్యత వహిస్తూ టీటీడీ పాలకవర్గం రాజీనామా చేయాలని కోరింది.