కాంగ్రెస్ సమావేశంలో ఉద్రిక్తత
NEWS Jan 08,2025 05:23 am
నిజామాబాద్ జిల్లా డిచ్‌పలిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్త ల సమావేశంలో ఉద్రిక్తత జరిగింది.కార్యకర్తలు గేటు వద్ద ఉన్న రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సూచించా రు. అక్కడ ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్గీయుల పేర్లు మాత్రమే ఉండటంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వర్గీయులు ఆగ్రహానికి లోనయ్యారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు మానాల మోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.