హైదరాబాద్‌లో 11 హెచ్‌ఎంపీవీ కేసులు
NEWS Jan 08,2025 04:26 am
ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఎంపీవీ కేసులు హైదరాబాద్ లో నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్‌లోని మణి మైక్రో బయాలజికల్ ల్యాబోరేటరీ 258 మందికి శ్వాస కోశ వైద్య పరీక్షలు చేపట్టింది. అందులో 205 మందికి ఎగువ శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు గుర్తించింది. 11 శాంపిల్స్‌లో హెచ్‌ఎంపీవీ పాజిటివ్ అని తేలిందని మణి మైక్రోబయాలజీ ల్యాబోరేటరీ వెల్లడించింది.