సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు
NEWS Jan 08,2025 04:22 am
మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులో మార్పులు చేర్పులు చేశారు. భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్ఎస్జీ సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండ్ లతో కౌంటర్ యాక్షన్ టీమ్ ను చేర్చారు. ప్రత్యేక రక్షణ టీం ఆధ్వర్యంలో ఈ కమాండోలకు కఠోర శిక్షణ ఇచ్చారు.