బతుకమ్మ కుంటపై హైడ్రా చర్యలు సబబే
NEWS Jan 07,2025 10:52 pm
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. బతుకమ్మ కుంటపై హైడ్రా తీసుకున్న చర్యలు సబబేనని పేర్కొంది. కుంట స్థలం తమదేనంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. బతుకమ్మ కుంట కుంటగానే గుర్తించాలని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో బతుకమ్మ కుంట చెరువు పునరుద్దరణ చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.