గవర్నర్ వెళ్లి పోవాలంటూ పోస్టర్స్
NEWS Jan 07,2025 10:47 pm
తమిళనాడు రాష్ట్రాన్ని విడిచి వెళ్లి పోవాలంటూ పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. అసెంబ్లీ సాక్షిగా జాతీయ గీతాన్ని అవమానించారంటూ గవర్నర్ రవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ఎంకే స్టాలిన్. డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గెట్ అవుట్ రవి అంటూ పోస్టర్లను అతికించారు. సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది.