హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు
NEWS Jan 07,2025 10:30 pm
తెలంగాణ రాష్ట్ర సర్కార్ సంచలన ప్రకటన చేసింది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. హైదరాబాద్ లోని బుద్ద భవన్ లో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. ఇక నుంచి అక్రమ నిర్మాణాలపై హైడ్రా పీఎస్ లో కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ప్రతీ సోమవారం ప్రజా వాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఫిర్యాదులు చేయొచ్చన్నారు.