కేసీఆర్ పై స్పీకర్ కీలక కామెంట్స్
NEWS Jan 07,2025 10:22 pm
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. మన్మోహన్ సింగ్ సంస్మరణ సభకు రావాలని కోరినా పట్టించు కోలేదన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో తెలంగాణ పేరుతో విధ్వంసం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల పక్షపాతి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల వద్దకు తీసుకు పోవడంలో ఉద్యోగుల పాత్ర కీలకం అన్నారు.