కేటీఆర్ పై రఘునందన్ రావు కామెంట్స్
NEWS Jan 07,2025 09:46 pm
మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు నచ్చక పోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం ఎందుకని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించ లేదా అని నిలదీశారు. అందుకే ప్రజలు పవర్ కు దూరం చేశారని ఎద్దేవా చేశారు.