అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్
NEWS Jan 07,2025 11:59 am
ప్రముఖ విద్యా సంస్థ బిట్స్ పిలానీ సంచలన ప్రకటన చేసింది. ఏపీ రాజధాని వెంకటపాలెం సమీపంలో 35 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో క్యాంపస్ ను నిర్మించనున్నట్లు వెల్లడించింది. ఈ క్యాంపస్ పూర్తిగా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రేరణ పొందిన వాస్తు శిల్పాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. నిర్మాణం ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది.