ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
NEWS Jan 07,2025 12:25 pm
మల్లాపూర్ కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ భూమేష్ తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలను సంప్రదించాలని అన్నారు.