కేటీఆర్ విచారణకు సహకరిస్తే మంచిది
NEWS Jan 07,2025 08:58 am
కేటీఆర్ పై నిప్పులు చెరిగారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పటికైనా విచారణకు సహకరించాలని కోరారు. లేక పోతే జైలు ఊచలు లెక్క బెట్టాల్సి వస్తుందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించింది కాక పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం మంచి పద్దతి కాదన్నారు. అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటూ పేర్కొనడం తన అహంకారానికి నిదర్శనమన్నారు.