కేటీఆర్ కు షాక్ పిటిషన్ డిస్మిస్
NEWS Jan 07,2025 08:13 am
మాజీ మంత్రి కేటీఆర్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసుకు సంబంధించి తనను ముందస్తుగా అరెస్ట్ చేయొద్దంటూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏసీబీ దాఖలు చేసిన పత్రాల ఆధారంగా దావాను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఏసీబీతో పాటు ఈడీ విచారణను వేగవంతం చేసింది. దీంతో కేటీఆర్ అరెస్ట్ కు లైన్ క్లియర్ అయ్యింది.