కేటీఆర్ ను మరోసారి విచారిస్తాం
NEWS Jan 07,2025 03:51 am
ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి నోటీసు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఏసీబీ ముందు విచారణకు హాజరు కావాల్సిన కేటీఆర్ తనకు చెందిన లాయర్లను అనుమతించక పోవడంతో అటెండ్ కాకుండానే వెళ్లి పోయారు. దీనిపై స్పందించిన ఈడీ విచారణ కోసం నోటీసు జారీ చేయడం గమనార్హం.